కోరహు
నిర్గమకాండము 6:21

ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ

సంఖ్యాకాండము 16:1

లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

సంఖ్యాకాండము 16:32

భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మింగివేసెను.

సంఖ్యాకాండము 26:9-11
9

కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.

10

ఆ సమూహపువారు మృతిబొందినప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగివేసినందునను, వారు దృష్టాంతములైరి.

11

అయితే కోరహు కుమారులు చావలేదు.

1దినవృత్తాంతములు 6:22

కహాతు కుమారులలో ఒకడు అమీ్మనాదాబు, వీని కుమారుడు కోరహు, కోరహు కుమారుడు అస్సీరు,

1దినవృత్తాంతములు 6:33

ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కనిపెట్టుచున్నవారెవరనగా, కహతీయుల కుమారులలో గాయకుడగు హేమాను; ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు

1దినవృత్తాంతములు 6:37

జెఫన్యా తాహతునకు పుట్టెను, తాహతు అస్సీరునకు పుట్టెను, అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను, ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను,

1దినవృత్తాంతములు 6:38

కోరహు ఇస్హారునకు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను, కహాతు లేవికి పుట్టెను, లేవి ఇశ్రాయేలునకు పుట్టెను.

కీర్తనల గ్రంథము 84:1-12
1

సైన్యములకధిపతివగు యెహోవా , నీ నివాసములు ఎంత రమ్యములు

2

యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి .

3

సైన్యములకధిపతివగు యెహోవా , నా రాజా , నా దేవా , నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను .

4

నీ మందిరమునందు నివసించువారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు .(సెలా.)

5

నీవలన బలమునొందు మనుష్యులు ధన్యులు యాత్రచేయు మార్గములు వారికి అతి ప్రియములు .

6

వారు బాకా లోయలోబడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును .

7

వారు నానాటికి బలాభివృద్ధినొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును .

8

యెహోవా , సైన్యములకధిపతివగు దేవా , నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా , చెవియొగ్గుము .(సెలా.)

9

దేవా , మా కేడెమా , దృష్టించుము నీవు అభిషేకించినవాని ముఖమును లక్షింపుము .

10

నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము . భక్తిహీనుల గుడారములలో నివసించుటకంటె నా దేవుని మందిర ద్వారమునొద్దనుండుట నాకిష్టము .

11

దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునైయున్నాడు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు .

12

సైన్యములకధిపతివగు యెహోవా , నీయందు నమ్మికయుంచువారు ధన్యులు .

కీర్తనల గ్రంథము 85:1

యెహోవా , నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు .

ఎల్కానా
1 సమూయేలు 1:1

ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒక డుండెను; అతని పేరు ఎల్కానా . అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు , అతనికి ఇద్దరు భార్యలుండిరి .

1దినవృత్తాంతములు 6:23

అస్సీరు కుమారుడు ఎల్కానా, ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు, ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు,

1దినవృత్తాంతములు 6:27

నహతు కుమారుడు ఏలీయాబు, ఏలీయాబు కుమారుడు యెరోహాము, యెరోహాము కుమారుడు ఎల్కానా.

1దినవృత్తాంతములు 6:28

సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నియు అబీయాయు.