ఆవరణము
నిర్గమకాండము 40:33

మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణ ద్వారపు తెరను వేసెను . ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను .

నిర్గమకాండము 27:9-19
9

మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.

10

దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.

11

అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.

12

పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.

13

తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.

14

ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.

15

రెండవ ప్రక్కను పరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.

16

ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; వాటి స్తంభములు నాలుగు వాటి దిమ్మలు నాలుగు.

17

ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.

18

ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.

19

మందిరసంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివైయుండవలెను.

నిర్గమకాండము 38:9-20
9

మరియు అతడు ఆవరణము చేసెను . కుడివైపున , అనగా దక్షిణ దిక్కున నూరు మూరల పొడుగుగలవియు పేనిన సన్ననారవియునైన తెరలుండెను .

10

వాటి స్తంభములు ఇరువది వాటి ఇత్తడి దిమ్మలు ఇరువది . ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి .

11

ఉత్తర దిక్కున నున్న తెరలు నూరు మూరలవి ; వాటి స్తంభములు ఇరువది , వాటి యిత్తడి దిమ్మలు ఇరువది , ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి .

12

పడమటి దిక్కున తెరలు ఏబది మూరలవి ; వాటి స్తంభములు పది , వాటి దిమ్మలు పది , ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి .

13

తూర్పువైపున , అనగా ఉదయపు దిక్కున ఏబది మూరలు ;

14

ద్వారముయొక్క ఒక ప్రక్కను తెరలు పదు నైదు మూరలవి ; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు .

15

అట్లు రెండవ ప్రక్కను , అనగా ఇరు ప్రక్కలను ఆవరణ ద్వారమునకు పదు నైదు మూరల తెరలు ఉండెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు .

16

ఆవరణము చుట్టునున్నదాని తెర లన్నియు పేనిన సన్ననారవి .

17

స్తంభముల దిమ్మలు రాగివి , స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి . వాటి బోదెలకు వెండిరేకులు పొదిగింపబడెను . ఆవరణపు స్తంభము లన్నియు వెండి బద్దలతో కూర్ప బడెను.

18

ఆవరణ ద్వారపు తెర నీల ధూమ్ర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది . దాని పొడుగు ఇరువది మూరలు ; దాని యెత్తు , అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా, అయిదు మూరలు .

19

వాటి స్తంభములు నాలుగు , వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు . వాటి వంకులు వెండివి .

20

వాటి బోదెలకు వెండిరేకు పొదిగింపబడెను , వాటి పెండె బద్దలు వెండివి , మందిరమునకును దాని చుట్టునున్న ఆవరణమునకును చేయబడిన మేకు లన్నియు ఇత్తడివి .

మత్తయి 16:18

మరియు నీవు పేతురువు3; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

1 కొరింథీయులకు 12:28

మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారినిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను.

ఎఫెసీయులకు 4:11

మనమందరము విశ్వాసవిషయములోను దేవుని కువ ూరునిగూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది సంపూర్ణపురుషులమగువరకు,

ఎఫెసీయులకు 4:12

అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు, ఆయన ఈలాగు నియమించెను.