And
నిర్గమకాండము 39:24-26
26

యెహోవా మోషేకు ఆజ్ఞాపించి నట్లు సేవచేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మపండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టు ఉంచిరి.

24

మరియు వారు చొక్కాయి అంచుల మీద నీల ధూమ్ర రక్త వర్ణములుగల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి .

25

మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మపండ్ల మధ్యను , అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టునున్న దానిమ్మపండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి .

దానిమ్మ పండ్లను
1 రాజులు 7:18

ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లికపని రెండు వరుసలు దానిమ్మపండ్లతో చేసెను; ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేసెను.

2 రాజులు 25:17

ఒక్కొక స్తంభపు నిడివి పదునెనిమిది మూరలు. దాని పైపీట యిత్తడిది, పైపీట నిడివి మూడు మూరలు. మరియు ఆ పైపీటచుట్టు ఉన్న అల్లికలును దానిమ్మపండ్లును ఇత్తడివి; రెండవ స్తంభమును వీటివలె అల్లికపని కలిగియుండెను.

గంటలను
జెకర్యా 14:20

ఆ దినమున గుఱ్ఱములయొక్క కళ్లెముల మీద -యెహోవాకు ప్రతిష్టితము అను మాట వ్రాయబడును ; యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పళ్లెములవలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును .