
నరహత్య చేయకూడదు.
నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.
ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.
ఒకడు చచ్చునట్లు మరియొకడు రాతితో వాని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయినయెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
మరియు ఒకడు చచ్చునట్లు మరియొకడు చేతికఱ్ఱతో కొట్టగా దెబ్బ తినినవాడు చనిపోయిన యెడల కొట్టినవాడు నరహంతకుడగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలెను.
వాని కనుగొనినప్పుడు వాని చంపవలెను. ఒకడు చచ్చునట్లు వాని పగపట్టి పొడిచినను, లేక పొంచియుండి వానిమీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరమువలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలెను.
నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంపవలెను.
అయితే పగపట్టక హఠాత్తుగా వానిని పొడిచినను, పొంచియుండక వానిమీద ఏ ఆయుధమునైన వేసినను, వాని చూడక ఒకడు చచ్చునట్లు వానిమీద రాయి పడవేసినను,
దెబ్బతినినవాడు చనిపోయిన యెడల కొట్టినవాడు వానిమీద పగపట్టలేదు, వానికి హానిచేయ గోరలేదు.
కాబట్టి సమాజము ఈ విధులనుబట్టి కొట్టినవానికిని హత్యవిషయములో ప్రతిహత్య చేయువానికిని తీర్పుతీర్చవలెను.
ఒకడు తన పొరుగువానియందు పగపట్టి వానికొరకు పొంచియుండి వానిమీదపడి వాడు చచ్చునట్లు కొట్టి
ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయినయెడల, వాని ఊరిపెద్దలు మనుష్యులను పంపి అక్కడనుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చేయువానిచేతికి వాని నప్పగింపవలెను.
వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయుల మధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను.
–నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను –నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
యేసు–నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.