నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతని నభిషేకించియున్నాను
1 సమూయేలు 16:1

అంతట యెహోవా సమూయేలు తో ఈలాగు సెలవిచ్చెను -ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలును గూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు ? నీ కొమ్మును తైలముతో నింపుము , బేత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను , అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును .

1 సమూయేలు 16:12

అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను . అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను . అతడు రాగానే-నేను కోరుకొన్నవాడు ఇతడే , నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా

1 సమూయేలు 16:13

సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను . తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను .

యెషయా 61:1-3
1

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

2

యెహోవా హిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతు లందరిని ఓదార్చుటకును

3

సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు . యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును .

యోహాను 3:34

ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును.