పిచ్చుకలకు
కీర్తనల గ్రంథము 90:1

ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.

కీర్తనల గ్రంథము 91:1

మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.

కీర్తనల గ్రంథము 116:7

నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.

మత్తయి 8:20

అందుకు యేసు–నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.

మత్తయి 23:37

యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.