పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
కీర్తనల గ్రంథము 105:39
వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
నిర్గమకాండము 13:21

వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచువచ్చెను.

నిర్గమకాండము 13:22

ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.

నిర్గమకాండము 14:24

అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

నిర్గమకాండము 40:35-38
35

ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోనికి వెళ్ల లేకుండెను .

36

మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్లునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమై పోయిరి .

37

ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్లని యెడల అది వెళ్లు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి .

38

ఇశ్రాయేలీ యులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. రాత్రివేళ అగ్ని దానిమీద ఉండెను . వారి సమస్త ప్రయాణములలో ఈలాగుననే జరిగెను.

నెహెమ్యా 9:12

ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివి.

నెహెమ్యా 9:19

వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొనిపోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.