న్యాయమునుబట్టి ఆయన తీర్పు తీర్చునుఆయన ప్రతిదినము కోపపడు దేవుడు.
కీర్తనల గ్రంథము 7:8

యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతనుబట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము.

కీర్తనల గ్రంథము 94:15

నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు .

కీర్తనల గ్రంథము 140:12

బాధింపబడువారి పక్షమున యెహోవా వ్యాజ్యెమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును.

కీర్తనల గ్రంథము 140:13

నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు.