యెహోవా, మేము నీకొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మామీద నుండును గాక
కీర్తనల గ్రంథము 5:11

నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు.

కీర్తనల గ్రంథము 5:12

యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్నుగూర్చి ఉల్లసింతురు.

కీర్తనల గ్రంథము 13:5

నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను నీ రక్షణవిషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా

కీర్తనల గ్రంథము 32:10

భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యెహోవాయందు కృప ఆవరించుచున్నది.

కీర్తనల గ్రంథము 119:49

(జాయిన్‌) నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసికొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు.

కీర్తనల గ్రంథము 119:76

నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.

మత్తయి 9:29

వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమి్మకచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలోఒ వారి కన్నులు తెరువబడెను.