పాశములు
కీర్తనల గ్రంథము 86:13

ప్రభువా , నా దేవా , నాయెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళపు అగాధమునుండి నా ప్రాణమును తప్పించియున్నావు .

కీర్తనల గ్రంథము 88:3-8
3

నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది .

4

సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని . నేను త్రాణలేనివానివలె అయితిని .

5

చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయియున్నారు గదా.

6

అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టియున్నావు .

7

నీ ఉగ్రత నామీద బరువుగానున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి . (సెలా.)

8

నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడియున్నాను

కీర్తనల గ్రంథము 88:15-17
15

బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను .

16

నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి .

17

నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొనియున్నవి

అపొస్తలుల కార్యములు 2:24

మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.

ఉరులు
ప్రసంగి 9:12

తమకాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు; చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు, అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుదురు.