యెహోవాను స్తుతించుడి
కీర్తనల గ్రంథము 105:45

తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి .యెహోవాను స్తుతించుడి .

యెహోవాను స్తుతింపుము
కీర్తనల గ్రంథము 103:1

నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము . నా అంతరంగముననున్న సమస్తమా , ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము .

కీర్తనల గ్రంథము 103:22

యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా , ఆయనను స్తుతించుడి . నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము .

కీర్తనల గ్రంథము 104:1

నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము . యెహోవా , నా దేవా నీవు అధిక ఘనతవహించినవాడవు నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించియున్నావు .

కీర్తనల గ్రంథము 104:35

పాపులు భూమిమీదనుండి లయమగుదురు గాక భక్తిహీనులు ఇకనుండకపోదురు గాక నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము యెహోవాను స్తుతించుడి .