యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.
నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.
నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును.
నీవు నాకు ఆశ్రయముగానుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.
మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.