అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును
సంఖ్యాకాండము 21:21

ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.

సంఖ్యాకాండము 21:23

అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.

ద్వితీయోపదేశకాండమ 2:30-36
30

అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను.

31

అప్పుడు యెహోవా చూడుము; సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టియున్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాని స్వాధీనపరచుకొన మొదలు పెట్టుమని నాతో చెప్పెను.

32

సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా

33

మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి

34

ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని, ప్రతి పురమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియులేకుండ నాశనము చేసితివిు.

35

పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి.

36

అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును ఆ యేటియొద్దనున్న పురము మొదలుకొని గిలాదువరకు మనకు అసాధ్యమైన నగర మొకటియు లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటిని మనకు అప్పగించెను.

ద్వితీయోపదేశకాండమ 29:7

మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా