నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకొనునప్పుడు యథార్థహృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.
దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునేవచ్చితిని.
నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
వారు అవమానము పొందియున్నారు కాగా నా నాలుక దినమెల్ల నీ నీతిని వర్ణించును.