యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.
అందుకాయనఅల్పవిశ్వాసు లారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.
అందుకాయన లేచి గాలిని గద్దించినిశ్శబ్దమై ఊరకుండు మని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళ మాయెను.
అప్పుడాయనమీరెందుకు భయపడు చున్నారు? మీరింకను నమి్మకలేక యున్నారా? అని వారితో చెప్పెను.
వారు మిక్కిలి భయపడిఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడు చున్నవని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
వారు వెళ్లు చుండగా ఆయన నిద్రించెను . అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి
గనుక ఆయనయొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా , నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి . ఆయన లేచి , గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను .
అప్పుడాయన మీ విశ్వాస మెక్కడ అని వారితో అనెను . అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి .