ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసివచ్చెను.ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడియున్నవి.నేను పండుకొనునప్పుడెల్ల
ఎప్పుడు లేచెదనా? రాత్రి యెప్పుడు గతించునా? అని యనుకొందును.తెల్లవారువరకు ఇటు ఆటు పొరలుచు ఆయాసపడుదును.
నా శ్రమను మరచిపోయెదననియు దుఃఖముఖుడనైయుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?
నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను
నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను.