నీవు దాని ముక్కుగుండ సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా?
యెషయా 27:1
ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును.
యెషయా 37:29

నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.

యెహెజ్కేలు 29:4

నేను నీ దవుడలకు గాలములు తగిలించి , నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి , నైలు లో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేప లన్నిటిని బయటికి లాగెదను .

యెహెజ్కేలు 29:5

నిన్నును నైలునది చేప లన్నిటిని అరణ్యములో పారబోసెదను , ఎత్తు వాడును కూర్చువాడును లేక నీవు తెరప నేల మీద పడుదువు , అడవి మృగములకును ఆకాశ పక్షులకును ఆహారముగా నిచ్చెదను .