మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును.
ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళముమీద మెరుపును మేఘములును సంచారముచేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును
శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను.
ఆయన తెలివివలన అగాధజలములు ప్రవహించుచున్నవి మేఘములనుండి మంచుబిందువులు కురియుచున్నవి.