మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.
దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహ లోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటి వారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి .
మరియు ఇబ్బందిగల వారందరును , అప్పులు చేసికొనిన వారందరును , అసమాధానముగా నుండు వారందరును , అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి యాయెను . అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చియుండిరి .
యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు .
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను