వారికి ఆహారమైయున్నవి
2 రాజులు 4:38

ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగియుండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి యుండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయిమీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంటచేయుమని సెలవిచ్చెను.

2 రాజులు 4:39

అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలము లోనికి పోయి వెఱ్ఱి ద్రాక్షచెట్టును చూచి, దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండ కోసికొని వచ్చి, వాటిని తరిగి కూర కుండలో వేసెను.

ఆమోసు 7:14
అందుకు ఆమోసు అమజ్యా తో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.
లూకా 15:16

వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.