మార్గముగలవానికిని
యెషయా 40:27

యాకోబూ నా మార్గము యెహోవాకు మరుగై యున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేల అనుచున్నావు ? ఇశ్రాయేలూ , నీవేల ఈలాగు చెప్పుచున్నావు ?

కంచె వేసిన
యోబు గ్రంథము 12:14

ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరును మరలకట్టజాలరు ఆయన మనుష్యుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికిని సాధ్యము కాదు.

యోబు గ్రంథము 19:8

నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు

కీర్తనల గ్రంథము 31:8

నీవు శత్రువులచేత నన్ను చెరపెట్టలేదు విశాలస్థలమున నా పాదములు నిలువబెట్టితివి.

విలాపవాక్యములు 3:7

ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు

విలాపవాక్యములు 3:9

ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు

హొషేయ 2:6

ముండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడ కుండ గోడ కట్టుదును .