నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలెను. వారు న్యాయమునుబట్టి జనులకు తీర్పుతీర్చవలెను.
అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరిగవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొనివచ్చి
బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా , బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు ఓయి , యీ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను .
బోయజు ఆ ఊరి పెద్దలలో పది మందిని పిలిపించుకొని , ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి .
అందుకు పురద్వారముననుండిన ప్రజ లందరును పెద్దలును మేము సాక్షులము , యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక ;
మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాటలాడవలెను , సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను .