నా యేలినవాడా , యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు . నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక.
రాజు బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చిన వారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.
అందుకు బెల్తెషాజరను దానియేలు ఒక గంటసేపు అతివిస్మయమునొంది మనస్సునందు కలవరపడగా , రాజు -బెల్తెషాజరూ , యీ దర్శనమువలన గాని దాని భావమువలన గాని నీవు కలవర పడకుము అనెను . అంతట బెల్తెషాజరు -నా యేలినవాడా , యీ దర్శనఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక,