of the same
ఎస్తేరు 9:1

రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారిమీద అధికారము నొందినట్లు అగుపడెను.

ఎస్తేరు 9:18

షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగానుండిరి.

ఎస్తేరు 9:21

యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మదిపొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభ దినమనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదునాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు

ఎస్తేరు 3:12

మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచబడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును,వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనములభాషను బట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.

ఎస్తేరు 8:9

సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దెకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువది యేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.