రాజురాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించెదనని ఆమెతో చెప్పగా
రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.
రాజు రాణియైన ఎస్తేరుతో యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసియుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్రహింపబడును,నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా