రాజు పరిచారకులు
ఎస్తేరు 1:10

ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతోషముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు

ఎస్తేరు 1:14

అతడు కాలజ్ఞానులను చూచి రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయకపోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.

ఎస్తేరు 6:14

వారు ఇంక మాటలాడుచుండగా రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.

అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,
ఆదికాండము 12:14

అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయియుండుట చూచిరి

1 రాజులు 1:2

కాబట్టి వారు మా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి