చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు
లేవీయకాండము 23:22

మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

నేనాజ్ఞాపించితిని
నెహెమ్యా 7:3

అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.

నిర్గమకాండము 31:14-17
14

కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను . నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము ; దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును .

15

ఆరు దినములు పనిచేయవచ్చును ; ఏడవ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము . ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్షనొందును .

16

ఇశ్రాయేలీ యులు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను ; అది నిత్య నిబంధన .

17

నాకును ఇశ్రాయేలీ యులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును ; ఏలయనగా ఆరు దినములు యెహోవా భూమ్యా కాశములను సృజించి యేడవ దినమున పని మాని విశ్రమించెనని చెప్పుము .

యిర్మీయా 17:19-22
19

యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడునీవు వెళ్లి యూదారాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మము నను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము

20

యూదా రాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి.

21

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి.

22

విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీ పితరుల కాజ్ఞాపించి నట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి.