కొందరును నివసించిరి
1దినవృత్తాంతములు 9:3

యూదావారిలోను బెన్యామీనీయులలోను ఎఫ్రాయిము మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా

1దినవృత్తాంతములు 9:4-9
4

యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఒమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊతైయు.

5

షిలోనీయుల పెద్దవాడైన ఆశాయాయు వాని పిల్లలును.

6

జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది,

7

బెన్యామీనీయులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు,

8

యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రికి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నీయా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము.

9

వీరును వీరి సహోదరులును తమ తమ వంశముల పట్టీలచొప్పున తొమి్మదివందల ఏబది ఆరుగురు; ఈ మనుష్యులందరును తమ పితరుల వంశములనుబట్టి తమ పితరుల యిండ్లకు పెద్దలు.

పెరెసు
ఆదికాండము 38:29

అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరెసు అను పేరు పెట్టబడెను.

రూతు 4:18

పెరెసు వంశావళి యేదనగా పెరెసు హెస్రోనును కనెను ,

పెరెసు
మత్తయి 1:3

యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;

లూకా 3:33

నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,