నాలుగవ దినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనికవేయబడెను. అతనితో కూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.
లేవీయులలో ప్రధానులైనవారిలో షబ్బెతైయును యోజాబాదును దేవుని మందిర బాహ్యవిషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.
వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను