తర్షీషుకు
1 రాజులు 10:22

సముద్రమందు హీరాము ఓడలతో కూడ తర్షీషు ఓడలును రాజునకు కలిగి యుండెను; ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరములకు ఒకమారు బంగారమును వెండిని దంతమును కోతులను నెమిలి పిట్టలను తీసికొని వచ్చుచుండెను.

1 రాజులు 22:48

యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను.

దంతము
యోబు గ్రంథము 39:13

నిప్పుకోడి సంతోషముచేత రెక్కలనాడించును. రెక్కలును వెండ్రుకలును దానికున్నందున అది వాత్సల్యము కలదిగానున్నదా?