అతని చేతిక్రింద
2 దినవృత్తాంతములు 31:13

మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యావలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతిక్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కనిపెట్టువారై యుండిరి.

పట్టణములందు
యెహొషువ 21:9-19
9

వారు యూదావంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేరులుగల యీ పట్టణములను ఇచ్చిరి.

10

అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి, ఏలయనగా మొదట చేతికివచ్చిన వంతుచీటి వారిది.

11

యూదావంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి.

12

అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి.

13

యాజకుడైన అహరోను సంతానపువారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును

14

దాని పొలమును లిబ్నాను దాని పొలమును యత్తీరును దాని పొలమును ఎష్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును

15

దెబీరును దాని పొలమును ఆయినిని దాని పొలమును యుట్టయును దాని పొలమును బేత్షెమెషును దాని పొలమును,

16

అనగా ఆ రెండు గోత్రములవారినుండి తొమి్మది పట్టణములను ఇచ్చిరి.

17

బెన్యామీను గోత్రమునుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును

18

అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి.

19

యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నియు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు.

1దినవృత్తాంతములు 6:54-60
54

అహరోను సంతతివారగు కహాతీయులు వంతువారు; వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులనుబట్టి వారికి ఏర్పడిన నివాసస్థలములు ఇవి.

55

యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టునున్న యుప గ్రామములును వారికప్పగింపబడెను.

56

అయితే ఆ పట్టణపు పొలములును దాని గ్రామములును యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను.

57

అహరోను సంతతివారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు, యత్తీరు ఎష్టెమో దాని గ్రామములు,

58

హీలేను దాని గ్రామములు, దెబీరు దాని గ్రామములు,

59

ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు.

60

మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబ దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణములన్నియు పదుమూడు.

నియమింపబడిరి
1దినవృత్తాంతములు 9:22

గుమ్మములయొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరు రెండువందల పన్నిద్దరు; వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి; వీరు నమ్మదగినవారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి.

పిన్న పెద్దలైన
1దినవృత్తాంతములు 25:8

తాము చేయు సేవ విషయములో పిన్నయని పెద్దయని గురువని శిష్యుడని భేదము లేకుండ వంతులకొరకై చీట్లువేసిరి.