సర్వసమాజము
కీర్తనల గ్రంథము 68:24-26
24

దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచియున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా

25

కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.

26

సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభువును స్తుతించుడి.

ప్రకటన 5:8-14
8

ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగుజీవులును, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణపాత్రలను పట్టుకొనియున్న ఆ యిరువదినలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱెపిల్ల యెదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.

9

ఆ పెద్దలు-నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని,

10

మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

11

మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను.

12

వారు- వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

13

అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును -సింహాసనాసీనుడైయున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.

14

ఆ నాలుగు జీవులు- ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.

గాయకులు పాడుచుండిరి
కీర్తనల గ్రంథము 89:15

శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు యెహోవా , నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు .