
అయితే తనతోకూడ యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్‌హోరోనువరకు ఉన్న యూదాపట్టణములమీద పడివారిలో మూడు వేలమందిని హతముచేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొని పోయిరి.
అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరి నొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా
ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను లెబానోనులోనున్న ముండ్లచెట్టొకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.
నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను
అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా
యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.
మరియు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.
మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.
అబ్నేరు లేచి మన యెదుట ¸యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబువారు చేయవచ్చుననెను.
కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.