
నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను.
ఇతని దినములలో ఎదోమీయులు యూదా రాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున
యెహోరాము తన రథము లన్నిటిని తీసికొని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి .
అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను .
ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.
ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి యేడు దినములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను .