కుదరచాలని వ్యాధి
2 దినవృత్తాంతములు 21:15

నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.

2 రాజులు 9:29

అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను.

అపొస్తలుల కార్యములు 12:23

అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.