బెన్యామీను
1దినవృత్తాంతములు 8:1-12
1

బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

2

మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

3

బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

4

అబీషూవ నయమాను అహోయహు

5

గెరా షెపూపాను హూరాము

6

ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీహూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;

7

నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.

8

వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

9

తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

10

యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

11

హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

12

ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

ఆదికాండము 46:21

బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు.

సంఖ్యాకాండము 26:38-41
38

బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;

39

అహీరామీయులు అహీరాము వంశస్థులు;

40

షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.

41

వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.

యెదీయవేలు
1దినవృత్తాంతములు 7:10

యెదీయవేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు బెన్యామీను ఏహూదు కెనయనా జేతాను తర్షీషు అహీషహరు.

1దినవృత్తాంతములు 7:11

యెదీయవేలు కుమారులైన వీరందరును తమ పితరుల యిండ్లకు పెద్దలు; వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమ శాలులు పదునైదువేల రెండు వందలమంది యుండిరి.