సమూయేలు
1 సమూయేలు 9:9

ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి యనిపించుకొనెను . పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణచేయుటకై ఒకడు బయలుదేరినయెడల -మనము దీర్ఘదర్శి యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.

అబ్నేరు
1 సమూయేలు 14:47-51
47

ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీయులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారి నందరిని ఓడించెను .

48

మరియు అతడు దండును కూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టినవారి చేతిలో నుండి వారిని విడిపించెను .

49

సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనతాను ఇష్వీ మెల్కీషూవ ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదాని పేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు .

50

సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు , ఈమె అహిమయస్సు కుమార్తె . అతని సైన్యా ధిపతి పేరు అబ్నేరు , ఇతడు సౌలునకు పినతండ్రియైన నేరు కుమారుడు .

51

సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు .

1 సమూయేలు 17:55

సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యా ధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ , ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు -రాజా , నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను .

యోవాబు
2 సమూయేలు 10:9-14
9

యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చియుండుట చూచి, ఇశ్రాయేలీయులలో బలాఢ్యులను ఏర్పరచి పంక్తులు తీర్చి సిరియనులను ఎదుర్కొనబోయెను.

10

అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలినవారిని తన సహోదరుడగు

11

అబీషైకి అప్పగించి సిరియనుల బలము నాకు మించినయెడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన యెడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తనవారిని వ్యూహపరచెను.

12

అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యము తెచ్చుకొందము, తన దృష్టికి ఏది యనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అబీషైతో చెప్పి

13

యోవాబును అతనితోకూడ నున్న వారును సిరియనులతో యుద్ధము చేయ బయలుదేరగానే వారు అతని యెదుట నిలువజాలక పారిపోయిరి.

14

సిరియనులు పారిపోవుట అమ్మోనీయులు చూచి వారును అబీషై యెదుట నిలువలేక పారిపోయి పట్టణములో చొరబడగా, యోవాబు అమ్మోనీయులను విడిచి యెరూషలేమునకు వచ్చెను.