సాదోకు
1దినవృత్తాంతములు 24:6
లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
1దినవృత్తాంతములు 24:31
వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
1దినవృత్తాంతములు 6:4-8
4

ఎలియాజరు ఫీనెహాసును కనెను, ఫీనెహాసు అబీషూవను కనెను,

5

అబీషూవ బుక్కీని కనెను, బుక్కీ ఉజ్జీని కనెను,

6

ఉజ్జీ జెరహ్యాను కనెను, జెరహ్యా మెరాయోతును కనెను,

7

మెరాయోతు అమర్యాను కనెను, అమర్యా అహీటూబును కనెను,

8

అహీటూబు సాదోకును కనెను, సాదోకు అహిమయస్సును కనెను,

1దినవృత్తాంతములు 6:50-53
50

అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను; వీని కుమారుడు ఫీనెహాసు, ఫీనెహాసు కుమారుడు అబీషూవ,

51

అబీషూవ కుమారుడు బుక్కీ, బుక్కీ కుమారుడు ఉజ్జీ, ఉజ్జీ కుమారుడు జెరహ్య,

52

జెరహ్య కుమారుడు మెరాయోతు, మెరాయోతు కుమారుడు అమర్యా, అమర్యా కుమారుడు అహీటూబు,

53

అహీటూబు కుమారుడు సాదోకు, సాదోకు కుమారుడు అహిమయస్సు.

1దినవృత్తాంతములు 12:27
అహరోను సంతతివారికి యెహోయాదా అధిపతి, అతనితోకూడ ఉన్నవారు మూడువేల ఏడు వందలమంది.
1దినవృత్తాంతములు 12:28
పరాక్రమశాలియైన సాదోకు అను ¸యవనునితో కూడ అతని తండ్రి యింటివారైన అధిపతులు ఇరువదియిద్దరు.
1దినవృత్తాంతములు 15:11
అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమీ్మనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.
1దినవృత్తాంతములు 16:39
గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
2 సమూయేలు 20:25

అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖికుడు;

1 రాజులు 2:35

రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను.

అహీమెలెకు
1 సమూయేలు 21:1

దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను ; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి -నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా

1 సమూయేలు 22:9-23
9

అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచియుండి -యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని .

10

అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి , ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా

11

రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకుల నందరిని పిలువ నంపించెను . వారు రాజు నొద్దకు రాగా

12

సౌలు అహీటూబు కుమారుడా , ఆలకించు మనగా అతడు చిత్తము నా యేలినవాడా అనెను .

13

సౌలు -నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి , అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితి రేమని యడుగగా

14

అహీమెలెకు -రాజా , రాజునకు అల్లుడై నమ్మకస్థుడై , ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటి వాడు నీ సేవకు లందరిలో ఎవడున్నాడు ?

15

అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా ? అది నాకు దూరమగునుగాక ; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా

16

రాజు అహీమెలెకూ , నీకును నీ తండ్రి ఇంటివారి కందరికిని మరణము నిశ్చయము అని చెప్పి

17

యెహోవా యాజకులగు వీరు దావీదు తో కలిసినందునను , అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియ జేయక పోయినందునను మీరు వారిమీద పడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయ నొల్లక యుండగా

18

రాజు దోయేగుతో -నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను . అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీద పడి ఏఫోదు ధరించుకొనిన యెనుబది యయిదు గురిని ఆ దినమున హతముచేసెను .

19

మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తి వాత హతము చేసెను; మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱలనేమి అన్నిటిని కత్తి వాత హతముచేసెను.

20

అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి

21

సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా

22

దావీదు -ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని ; నీ తండ్రి యింటి వారి కందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.

23

నీవు భయ పడక నాయొద్ద ఉండుము , నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయచూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.

2 సమూయేలు 8:17

అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;