A. M. 2962. B.C. 1042. ఇండ్లు
2 సమూయేలు 5:9

దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.

2 సమూయేలు 13:7

దావీదు నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతనికొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను.

2 సమూయేలు 13:8

కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికి పోయెను.

2 సమూయేలు 14:24

అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.

సిద్ధపరచి
1దినవృత్తాంతములు 15:3

అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.

1దినవృత్తాంతములు 16:1

ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొనివచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.

1దినవృత్తాంతములు 17:1-5
1

దావీదు తన యింట నుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధన మందసము తెరలచాటున నున్నదని చెప్పగా

2

నాతాను దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను.

3

ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.

4

నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయము కట్టించుట నీచేతకాదు.

5

ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.

కీర్తనల గ్రంథము 132:5
నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
అపొస్తలుల కార్యములు 7:46

అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.