
ఏలీయా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను . ఎలీషా యెహోవా జీవముతోడు , నీ జీవముతోడు , నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.
పిమ్మట ఏలీయా ఎలీషా , యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు , నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.
మోషే యెహోవా తో ఇట్లనెను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుప లేదు . నీవు నేను నీ పేరునుబట్టి నిన్ను ఎరిగియున్నాననియు , నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా.
కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నాయెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము . అప్పుడు నేను నిన్ను తెలిసికొందును ; చిత్తగించుము , ఈ జనము నీ ప్రజలేగదా అనెను.
అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును , నేను నీకు విశ్రాంతి కలుగజేసెదననగా
మోషే నీ సన్నిధి రా ని యెడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము .
నాయెడలను నీ ప్రజలయెడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును ? నీవు మాతో వచ్చుటవలననే గదా? అట్లు మేము, అనగా నేనును నీ ప్రజలును భూమి మీద నున్న సమస్త ప్రజల లోనుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను .
అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు . నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను , నీవు నివసించుచోటనే నేను నివసించెదను , నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ;
నీవు మృతి బొందు చోటను నేను మృతిబొందెదను , అక్కడనే పాతిపెట్టబడెదను . మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.
తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సుకుదిరినదని నయోమి తెలిసికొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి .