యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.
తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి . అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను , యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని -నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను .
ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలీసబెతు గర్భవతియై మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు
నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసెననుకొని , అయిదు నెలలు ఇతరుల కంట బడకుండెను .
మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
విశ్వాసమునుబట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని యెంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తిపొందెను.