ఆమెకు కుమారుడు లేడు
ఆదికాండము 15:2

అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా

ఆదికాండము 15:3

మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

ఆదికాండము 17:17

అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవి్వనూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అనుకొనెను.

ఆదికాండము 18:10-14
10

అందుకాయనమీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను

11

అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక

12

శారానేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.

13

అంతట యెహోవా అబ్రాహాముతోవృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?

14

యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.

ఆదికాండము 25:21

ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతిఆయెను.

ఆదికాండము 30:1

రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో - నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను.

న్యాయాధిపతులు 13:2

ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.

1 సమూయేలు 1:2

వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా . పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి .

1 సమూయేలు 1:8

ఆమె పెనిమిటియైన ఎల్కానా -హన్నా , నీ వెందుకు ఏడ్చుచున్నావు ? నీవు భోజనము మానుట ఏల ? నీకు మనో విచార మెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా ? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.

లూకా 1:7

ఎలీసబెతు గొడ్రాలై నందున వారికి పిల్లలు లేకపోయిరి ; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి .)