a sheepmaster
ఆదికాండము 13:2

అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడైయుండెను.

ఆదికాండము 26:13

అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను.

ఆదికాండము 26:14

అతనికి గొఱ్ఱల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతనియందు అసూయపడిరి.

2 దినవృత్తాంతములు 26:10

అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్షతోట పనివారును కలిగియుండిరి.

యోబు గ్రంథము 1:3

అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగానుండెను గనుక తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగానుండెను.

యోబు గ్రంథము 42:12

యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగువేల గొఱ్ఱలును ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి ఆడుగాడిదలును కలిగెను.

ఇచ్చుచుండువాడు
2 సమూయేలు 8:2

మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగున నున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

1దినవృత్తాంతములు 18:2

అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.

కీర్తనల గ్రంథము 60:8

మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోము మీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.

కీర్తనల గ్రంథము 108:9

మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.

కీర్తనల గ్రంథము 108:10

కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొనిపోవును ? ఎదోములోనికి నన్నెవడు నడిపించును ?

గొఱ్ఱపిల్లలను
యెషయా 16:1

అరణ్యపు తట్టుననున్న సెలనుండి దేశము నేలువానికి తగిన గొఱ్ఱపిల్లలను కప్పముగా సీయోనుకుమార్తె పర్వతమునకు పంపుడి