
అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాముచేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను.
ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.
దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.
మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.
మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.
ఈ ప్రకారము అతడు యోచించినదానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను.
మరియు తానే పాపముచేసి ఇశ్రాయేలువారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపములనుబట్టి ఆయన ఇశ్రాయేలువారిని అప్పగింప బోవుచున్నాడు.
తాను చేసిన పాపములచేత ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడై యరొబాము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను.
ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకును అహీయా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.