అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేం డ్లవాడై యుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను . అతని తల్లి పేరు అతల్యా ; ఈమె ఇశ్రాయేలు రాజైన ఒమీ కుమార్తె .
షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు .
ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయువారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతా ధిపతులను పిలువనంపించి , యెహోవా మందిరములోనికి వారిని తీసికొని పోయి , యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి , వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.
అంతట యెహూ తన పితరుల తోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను ; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను .