రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు , అధిపతులును బాకా ఊదువారును రాజు నొద్ద నిలువబడుటయు , దేశపు వారందరును సంతోషించుచు శృంగ ధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా
దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.
నీతిమంతులు వర్థిల్లుట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనులు నశించునప్పుడు ఉత్సాహధ్వని పుట్టును.
నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.