రాజైన సొలొమోను యెహోవాకు కట్టించిన మందిరము అరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై యుండెను.
పరిశుద్ధస్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరముయొక్క వెడల్పునుబట్టి యిరువది మూరల పొడవు,మందిరము ముందర అది పది మూరల వెడల్పు.
ఏ భాగమును విడువకుండ మందిరమంతయు బంగారముతో పొదిగించెను; గర్భాలయమునొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించెను.
మరియు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటిని చేయించెను, అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెలనుంచు బంగారపు బల్లలను,
మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మ కఱ్ఱతో దాని చేయవలెను .
దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర . అది చచ్చౌకముగా నుండవలెను . దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమైయుండవలెను .
దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను .