
యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్టగలరు? నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.
పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొన్నవారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థులవలన మరువబడియుండుటయు నేను చూచితిని; ఇదియు వ్యర్థమే.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్ను లెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి