తన కుమారులను పిలిచి గాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు
ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడ వెళ్లెను.
తెల్లగాడిదల నెక్కువారలారా, తివాసులమీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రకటించుడి.
అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
అందుకతడు నా యేలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదమీద గంత కట్టించి యెక్కి రాజుతో కూడ వెళ్లిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను.