అతడు నమస్కరించి చచ్చిన కుక్కవంటివాడనైన నాయెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటివాడను? అనెను.
అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడియుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్య ముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసిన దంతయు నాకు తెలియబడెను .
ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితో కూడనున్న అతని నలుగురు కుమారులును దాగుకొనిరి.
దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేల మట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.